
275views
మార్కాపురం టౌన్‌లో ఉన్న శ్రీలక్ష్మీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. ఆలయ అర్చకులు ఏవీకే నరసింహాచార్యుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కళశారాధాన, బలిహరణం నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి హనుమంత వాహనంపై వేంకటేశ్వరునికి పట్టణ వీధులలో నగరోత్సవం నిర్వహించారు.





