News

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

245views

కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు స్వామివారి పవళింపు సేవతో మంగళవారం వైభవంగా ముగిశాయి. ప్రత్యేక అలంకరణ గావించిన సింహాసనంపై స్వామి, అమ్మవార్ల పవళింపు సేవా కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. ఈవో ఎన్‌.చక్రధరరరావు ఆధ్వర్యంలో ఆలయ పర్యవేక్షకులు సత్యనారాయణ, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.