News

దేశ జనాభాను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలి – అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా

313views

దేశ జనాభాను నియంత్రించకపోతే… ఓ 50 ఏళ్ల తర్వాత అయోధ్య రామ మందిరం కనిపించకుండా పోతుందని అంతర్జాతీయ హిందూ కౌన్సిల్ కన్వీనర్ ప్రవీణ్ తోగాడియా అన్నారు. దేశంలో జనాభా నియంత్రణ చట్టం తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేసిన తోగాడియా.. రామ మందిర నిర్మాణానికి హిందువులందరూ ఏకమయ్యారని పేర్కొన్నారు. గ్రామగ్రామానికి తిరుగుతూ ఆలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరించారని తెలిపారు. హిందువుల ఐక్యతకు, భద్రతకు ఇదో మంచి పరిణామమని చెప్పారు. ఇదే సమయంలో జ్ఞానవాపి మసీదు అంశంపైనా వ్యాఖ్యలు చేశారు. ఆ మసీదులో ఆలయం ఉందన్న నిజం నిర్ధారణ అయిందని తేల్చి చెప్పారు.

విశ్వనాథ్ బాబా… ఆ మసీదులో కొలువుదీరారని అందులో శివలింగాన్ని పూజించకపోతే పాపం చుట్టుకుంటుందని హెచ్చరించారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించి శివలింగానికి పూజలు జరిపించే విధంగా అనుమతినివ్వాలని డిమాండ్ చేశారు. “బుల్‌డోజర్లు శాంతికి, అభివృద్ధికి ప్రతీకలు” అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల్నీ తోగాడియా సమర్థించారు. వాటితో పాటు కత్తులు, మిజైల్స్‌ కూడా శాంతికి చిహ్నమే అంటూ తేల్చి చెప్పారు.