
256views
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్ లో ఒక అద్భుతం జరిగింది. మాజీ ఉగ్రవాది షేర్ ఖాన్ జాతీయ జెండాను కిష్టావార్ ప్రాంతంలోని సెగ్డీ బాటా గ్రామంలోని తన నివాసం ఎదుట ఎగురవేశాడు. తన జీవితాన్ని తన దేశ ఉన్నతి కోసం అర్పిస్తానని తెలిపాడు షేర్ ఖాన్. 1998 నుంచి 2006 మధ్య కాలంలో హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామీ (హుజీ) ఉగ్రవాద సంస్థలో ఆయన పని చేశాడు. అప్పట్లో షేర్ ఖాన్ పేరు చెబితే.. జిల్లాని జనమంతా భయపడేవారు. 2006 లో ఆయన లొంగిపోయాడు. 13 ఏళ్ల పాటు జైలుశిక్షను అనుభవించి 2019లో విడుదలయ్యాడు. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య షహీనా, ఇద్దరు కుమార్తెలు సుమయా (19), ఖలీఫా బానో (17)తో కలిసి నివసిస్తున్నారు.





