News

సుస్థిరాభివృద్దికి భారతదేశం ఎనలేని కృషి – రష్యా అధ్యక్షుడు పుతిన్‌

297views

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ గురువారం గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ సర్వతోముఖాభివృద్ధి సాధించగలవనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆర్థిక, సాంఘిక, శాస్త్రీయ, తదితర రంగాల్లో భారత్ సాధించిన విజయాలు అందరికీ తెలుసన్నారు.

ప్రపంచం సుస్థిరంగా ఉండేందుకు, ప్రాంతీయ, అంతర్జాతీయ ఎజెండాలోని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించేందుకు భారత దేశం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇరు దేశాలు కలిసికట్టుగా కృషి చేస్తూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందగలమనే నమ్మకం తనకు ఉందన్నారు. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సహకార వృద్ధిని సాధించగలమని తెలిపారు. దీనివల్ల భారత్, రష్యాలలోని స్నేహపూర్వక ప్రజల మౌలిక ప్రయోజనాలు నెరవేరుతాయనడంలో సందేహం లేదని తెలిపారు.