
తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రం గిరి ప్రదర్శన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కర్నూలు-2 డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యన అరుణాచల క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం సూపర్‌లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సర్దార్‌హుస్సేన బుధవారం తెలిపారు. వచ్చే నెల 4న సాయంత్రం 6 గంటలకు కర్నూలు నుంచి బస్సు బయలుదేరి, 5న ఉదయం 4.30 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. అరుణాచలేశ్వర స్వామి దర్శనం తర్వాత అదేరోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, 6వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు కర్నూలుకు చేరుతుందని తెలిపారు. రానుపోనూ చార్జీ రూ.2వేలుగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్ తెలిపారు. అడ్వాన్స రిజర్వేషన సౌకర్యం కల్పించామన్నారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ మేనేజర్ 73828 71131 సెల్ నెంబర్‌కు సంప్రదించవచ్చని సూచించారు.





