News

శ్రీవాణి ట్రస్టుపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు… 650 కోట్లతో ఆలయాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

270views

శ్రీవాణి ట్రస్ట్ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా శ్రీవాణి ట్రస్ట్ విరాళాల వివరాలను ఆయన వెల్లడించారు. రూ.లక్ష లోపు విరాళాలు ఇచ్చే భక్తులకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయిస్తామని.. ఒక లక్ష రూపాయల విరాళం ఇచ్చిన భక్తులకు దర్శనం, గదులు ఇచ్చే వెసులు బాటు ఉండేదన్నారు. రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తులకు ఒకసారి బ్రేక్ దర్శనం ఇచ్చే పద్దతి తీసుకొని వచ్చామని.. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దాదాపు రూ. 650 కోట్ల నిధులు సమకూరిందన్నారు.

దక్షిణ భారత దేశంలో 2068 ఆలయాల నిర్మాణం..
శ్రీవాణి ట్రస్టుకు వచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలతో దక్షిణ భారత దేశంలో 2068 ఆలయాలను నిర్మిస్తున్నట్లు వివరించారు. సమరత సంస్థ ఫౌండేషన్ ద్వారా ఈ ఆలయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 111 ఆలయాల పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయన్నారు. 320 ఆలయాలకు రూ. 32 కోట్ల వ్యయం వెచ్చిస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ ద్వారా 932 ఆలయాలకు రూ. 100 కోట్లు.. పురాతన 150 ఆలయాలకు జీర్ణోద్ధరణకు రూ.130 కోట్లు ఇచ్చామన్నారు.

ఆరు నెలల్లోనే అన్ని ఆలయాలను పూర్తి చేస్తామని ఈవో తెలిపారు. ఆలయ నిర్మాణం చేపట్టే గ్రామంలో కమిటీ ఏర్పాటు చేస్తామని.. కమిటీలో టీటీడీ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి నగదు కమిటీ అకౌంట్ వెళ్తుందని.. శ్రీవాణి ద్వారా రోజుకు 1000 టికెట్లు మాత్రమే ఇస్తున్నామని.. ఆన్ లైన్‌లో 750 , విమానశ్రయం లో 250 శ్రీవాణి టికెట్లు కేటాయిస్తున్నామన్నారు. అలాగే గదుల కేటాయింపుతో రూ.71.41 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.

టీటీడీ ఆధ్వర్యంలో 396 కళ్యాణ మండపాలు ఉన్నాయని.. తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణ మండపానికీ మరమ్మతులు చేశామన్నారు. స్థానికుల కోరిక మేరకే ఆధునికరించి అద్దె ధరను పెంచామని చెప్పారు. అదేవిధంగా 384 కళ్యాణ మండపాల అద్దె ధరలను పెంచలేదని.. తిరుమలలో ఉద్యోగులకు కేటాయించిన 850 గదుల్లో.. 650 గదులను వెనక్కి తీసుకొని సామాన్య భక్తులకు ఈవో ధర్మారెడ్డి కేటాయిస్తున్నామన్నారు.