News

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొస్తాం – ఈవో ధర్మారెడ్డి

286views

తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రికరించిన దృశ్యాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డ్రోన్ సర్వేకు IOCకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే అన్నదానం దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ వరకు మాత్రమే డ్రోన్ సర్వేకు వారికి పర్మిషన్ ఉందన్నారు. టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదని.. టీటీడీ హై సెక్యూరీటీ వ్యవ‌స్థ ఉందన్నారు. త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామన్నారు. ఇప్పటికే డ్రోన్ల వ్యవహారంపై కేసు నమోదు చేశామని.. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందన్నారు. డ్రోన్ ఆపరేటర్‌ల అత్యుత్సాహంతో వీడియోలు తీసుంటే చర్యలు చేపడతామన్నారు. ఫేక్ వీడియోలైతే ఏమీ చేయలేమని వ్యాఖ్యానించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఐవోసీ సిబ్బంది అత్యుత్సాహంతో ఆలయాన్ని డ్రోన్‌తో చిత్రీకరించారు అని వస్తున్న వార్తలపై ఈవో ధర్మారెడ్డి స్పందించారు. ఇప్పటికే ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. ఐఓసీ సిబ్బందిపై కేసు నమోదు చేశామన్నారు.