
Ring Ceremony , a Hindu wedding ritual wherein bride and groom hand over their rings to each others as symbol of love
67views
సమాజంలో గోవుల పట్ల పెరుగుతున్న నిర్ల క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. సనాతన ఆచారాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో గోమాత సన్నిధిలో ఓ యువజంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లోని జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి రంజన శర్మకు, ఆగ్రా నివాసి యతేంద్ర శర్మకు ఇటీవల పెళ్లి కుదిరింది. గోమాత సన్నిధిలో ఈ వివాహం జరగాలని కుటుంబీకులు కోరగా.. దానికి వరుడు కుటుంబం సంతోషంగా అంగీకరించింది. ఈ క్రమంలో కల్యాణం రోజున ముందుగా సాధువుల సమక్షంలో వధూవరులు ఓ గోవుకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత వేదమంత్రాల సాక్షిగా వారిద్దరికి వివాహం జరిగింది. సనాతన ధర్మాలకు గౌరవం ఇస్తున్న యువ జంటకు పలువురు అభినందనలు తెలిపారు.