News

మోడీకి ఓటెయ్యమన్నాడని వృద్దుడిని చంపిన డిఎంకె అభిమాని

616views

మిళనాడులో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

తమిళనాడులోని తంజావూరు జిల్లా వరదనాడు తాలూకా తెన్నమనాడు గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్దుడు గోవిందరాజ్ మోడీ వీరాభిమాని. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. అయినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబం నుండి వేరుపడి ఒక్కడే నివసిస్తున్నాడు.

రాజకీయాలలో చురుకుగా వుండే గోవిందరాజ్ నిజానికి చాలా సంవత్సరాలుగా జయలలిత అభిమాని, AIADMK కార్యకర్త. అయితే ఈ మధ్య కాలంలో మోడీ పని తీరు నచ్చి ఆయనకు అభిమానిగా మారాడు. గత కొన్ని వారాలుగా BJP, AIADMK అలయన్సుకు మద్దతుగా లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యర్ధుల నుండి ప్రచారం చెయ్యవద్దంటూ పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. కానీ గోవిందరాజ్ అవేవీ లెక్క చేయక మోడీ పధకాల గురించి తమిళనాడుకు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వరదనాడు పరిసర ప్రాంతాలలో తీవ్రంగా ప్రచారం నిర్వహిస్తుండేవాడు. MGR, జయలలిత, మోడిల ఫోటోలు మేడలో వేసుకు తిరిగే వ్యక్తిగా ఆ ప్రాంతమంతా అతడు సుపరిచితుడు.

ఏప్రిల్ 14న ఎన్నికల ప్రచారంలో వున్న గోవిందరాజ్ కు వరదనాడు బస్ స్టాండ్ సమీపంలో గోపీనాథ్ అనే వ్యక్తితో వాగ్వివాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం గోవిందరాజ్ మోడీకి వోటు వెయ్యవలసినదిగా ప్రచారం చేస్తుండగా గోపీనాథ్ అభ్యంతరం  వ్యక్తం చేస్తూ ఆయనతో వాగ్వివాదానికి దిగాడు. గోవిందరాజ్ తో వాదించలేని గోపీనాథ్ తీవ్ర ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి వృద్దుడు అని కూడా చూడకుండా గోవిందరాజ్ ఛాతి మీద, పొట్టలో పిడిగుద్దులు కురిపించాడు. గోవిందరాజ్ క్రింద పడిపోయినా ఆపకుండా తీవ్రంగా కొట్టి అక్కడినుండి వెళ్ళిపోయాడు. అది చూసి కూడా ప్రజలు చాలా సేపటి వరకు ఆయనను ఆసుపత్రికి తరలించలేదు. కానీ ఆసుపత్రికి తరలించే సరికే ఆలస్యం అయిపొయింది. తీవ్ర గాయాలతో అప్పటికే గోవిందరాజ్ మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

గోవిందరాజ్ కుమార్తె ఫిర్యాదుతో FIR నమోదు చేసిన పోలీసులు గోపీనాథ్ ను అరెస్టు చేశారు. గోపీనాథ్ DMK – కాంగ్రెస్ అలయన్సు కార్యకర్త అని పోలీసులు ప్రకటించారు. DMK – కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల BJP కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నట్లు BJP తమిళనాడు శాఖ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసింది.