
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత 9 రోజుల్లో 130 మంది చనిపోయారు. ఈ మరణాలు చూసి డాక్టర్లే విస్తుపోతున్నారు. ఇవన్నీ చలి వల్ల జరుగుతున్న దారుణాలు అని తేలింది. మరీ ముఖ్యంగా కాన్పూర్ లో హార్ట్ పేషెంట్స్ ఎక్కువయినట్టు అక్కడ నమోదు అవుతున్న కేసులు చెబుతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో నమోదు అయిన మరణాలు అన్నీ చలి కారణంగా గుండెపోటు వల్లే సంభవించాయట. విపరీతమైన చలి కారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ కారణంగానే అక్కడ చలికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కేసులు నమోదు అవుతున్నాయి. మరొక షాకింగ్ నిజం ఏమిటంటే.. ఇది కేవలం వృద్దులలో మాత్రమే నమోదవుతున్నది కాదు టీనేజ్ నుంచి అన్ని వయసుల వారిలో ఈ సమస్యలు వస్తున్న సంఘటనలు చాలా ఎదురవుతున్ననాయట. ఈ సంవత్సరం చలి చాలా తీవ్రంగా ఉందని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.





