News

ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశా – పోలీసుల విచారణలో బైరి నరేశ్ వెల్లడి

330views

అయ్యప్ప స్వామిపై హేతువాది ముసుగులో బైరి నరేశ్ అనే వ్యక్తి ఇటీవల అనుచిత వ్యాఖ్యాలు చేసిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు తాను ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్లు సమాచారం. ఇక.. కావాలనే బైరి నరేశ్ ను ముఖ్య వక్తగా పిలిచినట్లు కార్యక్రమ నిర్వాహకుడు హనుమంతు కూడా అంగీకరించాడు. బైరి నరేశ్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని కొడంగల్ పోలీసులు కోర్టుకు వెల్లడించారు. మత విద్వేషాలకు పాల్పడాలన్న ఉద్దేశంతోనే బైరి నరేశ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో పోలీసుల రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కొడంగల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అయ్యప్ప స్వామిపై బైరి నరేశ్ హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడారు. దీంతోపాటు ప్రధానంగా అప్యయ్య స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అయ్యప్ప స్వాములు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపట్టడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

సోర్స్‌ — రిథమ్‌ యాప్‌