News

‘అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు’.. 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు

386views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు ఆమెను ముక్కలుగా కోసి, ఢిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆమె ముందుగానే భయపడినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని వసాయ్‌లో ఆమె చేసిన ఫిర్యాదు బట్టి ఈ విషయం వెల్లడవుతోంది. ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

శ్రద్ధా, అఫ్తాబ్‌ సహజీవనం చేస్తోన్న సమయంలో రెండేళ్ల క్రితం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అఫ్తాబ్‌ ఆమె మీద చేయిచేసుకున్నాడు. ఊపిరాడకుండా చేసి, చంపాలని చూశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ‘నన్ను చంపి, ముక్కలు చేసి, విసిరేస్తానని బెదిరించాడు. నన్ను కొట్టి ఆరునెలలు అయింది. కానీ చంపేస్తానని బెదిరించడంతో ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయాను’ అని దానిలో ఆమె పేర్కొంది. ఇదివరకు ఆమె మొహంపై గాయాలతో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అదే ఏడాది తన స్నేహితుడికి ఆమె దానిని షేర్ చేసింది. తీవ్ర వెన్ను గాయాలు కావడంతో అప్పుడు ఆమె ఆసుపత్రిలో కూడా చేరిందని ఆ స్నేహితుడు వెల్లడించాడు. అయితే ఈ రెండు ఘటనలు ఒకటేనా లేదా తెలియాల్సి ఉంది.

Source: Eennadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి