
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్యపై అసొం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ లవ్ జిహాద్ పేరిట ముంబై నుంచి శ్రద్ధాను ఢిల్లీకి తీసుకుపోయిన అఫ్తాబ్ 35 ముక్కలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రద్ధా డెడ్‌బాడీ ఫ్రిడ్జ్‌లో ఉండగానే మరో మహిళను ఫ్లాట్‌కు పిలుచుకుని డేటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకెంత కాలం ఇలాంటి అఫ్తాబ్‌లు పుట్టుకొస్తారని ఆయన ప్రశ్నించారు. శక్తిమంతమైన ప్రభుత్వాలు లేకపోతే ప్రతి చోటా ఇలాంటి అఫ్తాబ్‌లే పుడతారని హెచ్చరించారు. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోందని, దీని ద్వారా ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
యూసీసీ ద్వారా ఇకపై ముస్లిం పురుషులు మూడు, మూడు వివాహాలు చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ తరహాలోనే యూసీసీ ద్వారా కూడా ముస్లిం సోదరీమణులకు న్యాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఇకపై ముస్లిం మహిళలను ఆటబొమ్మలుగా చూడటం కుదరదని హిమంత బిశ్వశర్మ చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గాంధీధామ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: Nijamtoday