
565views
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చించాలి. జిల్లా కేంద్రాల్లో అదనంగా మరో కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్టు తెలిసింది. ఈ నిధుల్ని గ్రాంటు ఇన్ ఎయిడ్ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల ఏడో తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Source: Eenadu





