News

టీటీడీలో 120 సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు.. 5 వేల మంది హాజరు

389views

తిరుపతి: తిరుపతి తిరుమల దేవస్థానంలో పొరుగు సేవల విధానంలో సెక్యూరిటీ గార్డుల కొరకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలు, విద్యాసంస్థలు ఆసుపత్రుల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం కోసం.. లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ ఈ ప్రక్రియ చేపట్టింది. నెలకు రూ. 11వేలు జీతానికి 102 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకునేందుకు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ ఏజెన్సీ నియామకం చేపట్టింది. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్ర నలుమూలల నుంచి యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆవరణలో చేపట్టిన నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు 5 వేల మందికిపైగా యువకులు తరలివచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి