News

రాహుల్​ సభలో జాతీయగీతం బదులు మరో పాట!

362views

వసీమ్‌: మహారాష్ట్రలోని వసీమ్‌లో భారత్‌ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో రాహుల్‌ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయగీతాలాపన చేయమంటారు. దీంతో సభావేదికపై ఉన్నవారితోపాటు, సభకు హాజరైన వారంతా లేచి నిల్చుంటారు. కానీ, జాతీయగీతం బదులు వేరే పాట వినిపించడంతో ఆశ్చర్యపోయిన రాహుల్‌ వేదికపై ఉన్న నేతలను ఇదేంటని ప్రశ్నిస్తారు. వెంటనే ఆ పాటను ఆపి, జాతీయగీతం ప్లే చేసినట్టు వీడియోలో రికార్డు అయింది. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని బీజేపీ నేతలు ట్విట్టర్​లో షేర్‌ చేస్తూ “భారత్‌ను ఏకం చేసేవారి జాతీయగీతం” అంటూ విమర్శలు చేశారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర మహారాష్ట్రలోని అంకాలా జిల్లాలో కొనసాగుతోంది. నవంబరు 20న మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి