
గువాహతి: 14 ఏళ్ళ బాలిక నిద్రలో ఉండగా 42 ఏళ్ళ హజరత్ అలీ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి హత్య చేశాడు. ఈ సంఘటన అసొంలోని సోనిత్‌పూర్ జిల్లా, ధేకియాజులి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలిసింగా, భకుమారిలో జరిగింది. బాలిక ఆ ప్రాంతంలోని ఉన్నత పాఠశాలలో చదువుతోంది. సోమవారం రాత్రి భోజనం చేసి తండ్రి, కూతురు నిద్రకు ఉపక్రమించారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తండ్రి నమాజ్ కోసం సమీపంలోని మసీదుకు వెళ్ళాడు.
నమాజ్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి తన కూతురు మంచంపై శవమై పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందిన తర్వాత ఏఎస్పీ మధురిమా దాస్ నేతృత్వంలోని పోలీసుల బృందం, ఫోరెన్సిక్ బృందం నేరస్థలాన్ని సందర్శించి, స్నిఫర్ డాగ్‌లను మోహరించింది.
ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించగా, స్నిఫర్ డాగ్ అదే పరిసరాల్లో నివసించే హజరత్ అలీ వైపు చూపింది. విచారణలో హజరత్ అలీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని పోలీసులు గుర్తించారు. అదే రోజు తదుపరి విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఈ విచారణలో హజరత్ అలీ చివరికి బాలికను తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతో ఆమె ఒంటరిగా ఉండడాన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లోకి ప్రవేశించానని చెప్పాడు. అయితే, అదే ప్రయత్నంలో బాలిక నిద్రలేచి కేకలు వేసిందని, భయంతో తాను ఆమెను గొంతు నులిమి చంపినట్టు చెప్పాడు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు తేజ్‌పూర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు పంపారు.
Source: HINDU POST





