188
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇమ్రాన్ ఖాన్ పై ఏకే-47 గన్‌తో అటాక్ చేశారు. వజీరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సమీపం నుంచే ఏకే-47 గన్‌తో కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి బుల్లెట్లు దిగినట్టు పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు. ఇమ్రాన్‌పై దాడి జరిగినప్పుడు తాను పక్కనే ఉన్నానని ఇస్మాయిల్ చెప్పారు. గాయపడ్డ ఇమ్రాన్‌ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. ఈ దాడిలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్టు పాక్ మీడియా చెబుతోంది.
Source: NationalistHub