News

దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి

275views

చామరాజ్​నగర్​: కర్ణాటకలో దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి నెలకొంది. చామరాజ్​నగర్​లోని చెన్నప్పనపురంలో ఓ రథం కూలింది. రెండేళ్ళ తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రథం చుట్టూ దాదాపు 800 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రథోత్సవం జరగకపోయినా దేవుడికి ఇతర పూజలు చేసినట్టు గ్రామస్థులు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి