
333views
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీక మాసం సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలోని కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయ మాడ వీధుల్లో దీపారాధన నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో శ్రీగిరి పురవీధుల్లో సందడి వాతావరణ నెలకొంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో భక్తులకు వేడిపాలు, అల్పాహార ప్రసాదాలను పంపిణీ చేస్తోంది.
Source: Eenadu





