
386views
దిండిగల్: తమిళనాడులో అమ్మన్ విగ్రహంపై దాడి జరిగింది. ఇందుకు కారకులైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల పునరుద్ధరించిన ఆలయంలో అమ్మన్ మూర్తిని ధ్వంసం చేసినందుకు అజీజ్, సిరాజుద్దీన్, వీర గౌతమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిండిగల్ జిల్లాలోని జేవియర్ పాళయంలోని అమ్మన్ ఆలయానికి చెందిన భక్తులు అక్టోబర్ 27న విధ్వంసానికి గురైన స్థితిలో అమ్మన్ మూర్తిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఇటీవలె ఆలయాన్ని పునరుద్ధరించి, సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రవేశ ద్వారం ఇరువైపులా రెండు అమ్మన్ మూర్తులు ఉంచారు. అక్టోబర్ 27 ఉదయం వాటిలో ఒకటి ధ్వంసమై కనిపించింది. విచారణలో అంతకుముందు రాత్రి కొందరు ఉద్దేశ్యపూర్వకంగా మూర్తిని ధ్వంసం చేసినట్టు ఆలయ నిర్వాహకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Source: HNDU POST





