News

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు…మోదీ

350views

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజరాత్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగమేళాలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ పంచాయతీ సర్వీసుబోర్డు పరిధిలో 5000 మందికి, గుజరాత్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరిధిలో 8000 మందికి అపాయింట్‌మెంట్ పత్రాలను ముఖ్యమంత్రి భుపేంద్ర పాటిల్‌ అందించారు. ఇటీవల ధనత్రయోదశి రోజున నిర్వహించిన ఉద్యోగమేళాలో దేశవ్యాప్తంగా 75 వేలమంది అభ్యర్థులకు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను జారీ చేసినట్టు మోదీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లోనూ ప్రారంభిస్తామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి