News

‘కరెన్సీ నోట్లపై లాలూ చిత్రం ముద్రించాలి’.. ఆర్జేడీ అనుచిత డిమాండ్​… మండిపడ్డ బీజేపీ

452views

బీహార్‌: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ లేవనెత్తిన కరెన్సీ నోట్ల విషయం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆ​ర్జేడీ మరో కొత్త డిమాండ్​ను తెరపైకి తెచ్చింది. దేవతల చిత్రాలకు బదులుగా ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్​ యాదవ్​, కర్పూరి ఠాకూర్ చిత్రాలను ఉంచాలని కోరారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్​ కుమార్. ఇలా చేస్తే భారతీయ కరెన్సీ విలువ తగ్గదని చెప్పారు.

మరోవైపు బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్.. ఆర్జేడీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘భారతీయ కరెన్సీ అనేది ఆర్జేడీ ఎన్నికల మేనిఫెస్టో కాదు. ఎవరో దేవతల ఫొటోలను పెట్టాలని కోరారు.. ఇప్పుడు మీరు లాలూ, కర్పూరి చిత్రాలను ఉంచాలని కోరుతున్నారు. మీరందరూ మీకు నచ్చిన విధంగా వ్యవహరిస్తే.. నోట్లపై తేజశ్వీ యాదవ్​ చిత్రాలను కూడా ఉంచాలని డిమాండ్​ చేస్తారు’ అని ఆయన అన్నారు.

ఈ డిమాండ్లపై స్పందించిన పట్నాకు చెందిన రాజకీయ నిపుణుడు డాక్టర్ సంజయ్ కుమార్ స్పందించారు. ఇటువంటి డిమాండ్లు భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీని అవమానించడమే తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణపై ఏళ్ళ తరబడి కటకటాల వెనుక ఉన్న వ్యక్తి బొమ్మను పెట్టడం గురించి ఎవరైనా ఎలా ఆలోచిస్తారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడం గురించి ఆర్జేడీ నాయకులు ఆలోచించాలని ఆయన హితవు పలికారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి