
400views
వుహాన్: చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి మూలంగా భావిస్తున్న వుహాన్ నగరంలో మంగళవారం కొత్తగా 18 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ నగరంలో పాక్షికంగా లాక్‌డౌన్ విధించారు. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్ జిల్లాలో అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్ నిబంధనలు వచ్చే ఆదివారం వరకు ఉంటాయని, పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.
Source: Nijamtoday





