
397views
వాటికన్: ఆన్‌లైన్‌లో పోర్న్ కంటెంట్ చూడడమనేది మతబోధకులను మానసికంగా బలహీనులను చేస్తుందని, దానికి దూరంగా ఉండాలని నన్‌లు, ప్రీస్ట్‌లను పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. వాటికన్‌లోని నిర్వహించిన ఓ సెషన్‌లో ‘డిజిటల్, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవచ్చు’ అన్న ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలను వాడొచ్చు కానీ అవి మన సమయాన్ని వృథా చేసేవిగా ఉండరాదన్నారు. పోర్నోగ్రఫీ గురించి మాట్లాడిన ఆయన… ‘చాలామందికి దీన్ని వీక్షించే దుర్వ్యసనం ఉంది.. చివరకు ప్రీస్ట్‌లు, నన్‌లకు కూడా’ అన్నారాయన. ఫోన్‌లోంచి ఇలాంటివి డిలీట్ చేసేస్తే చేతిలో ఇక ఆ టెంప్టేషన్ ఉండదన్నారు పోప్. చర్చి బోధనల ప్రకారం పోర్నోగ్రఫీ పవిత్రకు పూర్తిగా వ్యతిరేకం.





