
నంద్యాల: నంద్యాల జిల్లా, ఆత్మకూరు పరిధిలో గల నాగలూటీ చెంచు గూడెంలో సంఘమిత్ర సంచార వైద్యశాల, ఐఎమ్ఏ మహిళా విభాగం డాక్టర్లచే వైద్య శిబిరం జరిగింది. గర్భిణులకు, చిన్నారులకు రక్త హీనత, చర్మ వ్యాధులు ఉన్న వారికి ఉచితంగా మందులను అందజేశారు. 100 మందికి పైగా చెంచు మహిళలు, చిన్నారులు వైద్య సేవలు పొందారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్యశివ సుందరి, డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ, డాక్టర్ సుసుమ, డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ హరిత, డాక్టర్ మాధవి, డాక్టర్ లలిత కుమారి స్వచ్ఛందంగా వైద్య సేవలందించారు.


సంఘమిత్ర సేవా సమితి తరుఫున ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యకారిణి సదస్యులు డాక్టర్ ఉదయ శంకర్, సంఘమిత్ర అధ్యక్షుడు కె. నాగసుబ్బారెడ్డి, కార్యవర్గ సభ్యులు వి.రమణయ్య గౌడ్, ఆవాస్ ప్రముఖ్ గంగాధర్, సేవా ప్రముఖ్ శ్రీనివాసులు, శ్రీ వాసుదేవ రెడ్డి, గోకవరం ఆవాస్ ప్రముఖ్ రామకృష్ణ తదిరులు సంయోజక సారథ్యం వహించారు.





