News

పలాసలో ఆవుపై కత్తితో దాడి.. వ్యాపారిని దేహశుద్ధి చేసిన స్థానికులు!

243views

పలాస: ఏపీలోని శ్రీకాకుళం జిల్లా, పలాస-కాశీబుగ్గలో దారుణం చోటుచేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి ఆవుపై కత్తితో దాడి చేశాడు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో మల్ల ఉమాశంకర్‌ అనే వ్యాపారి పండ్లు అమ్ముతున్నాడు. అయితే, అటుగా వెళుతున్న ఆవు ఉమాశంకర్‌ దుకాణంలోని ఓ బొప్పాయి పండును కొరికింది. ఇది చూసిన ఆ వ్యాపారి ఆగ్రహంతో గోమాతపై దాడి, కత్తితో నరికాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు ఉమా శంకర్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పశువైద్యశాలకు సమాచారం ఇవ్వడంతో వైద్యులు ఆ గోమాతకు వైద్యం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి