News

దేశవ్యాప్తంగా 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభించిన మోదీ

561views

న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు.. 16వేల కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 22కోట్ల మంది రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులతోపాటు 1700 రకాలైన విత్తనాలను అందించి పంట ఉత్పాదకతను పెంచనున్నట్టు మోదీ వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో నానో యూరియా ప్రాధాన్యతను తెలిపిన మోదీ.. ఒక సీసా ద్రవరూప యూరియా ఒక బస్తా యూరియాతో సమానమని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి