News

4 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ భారీగా సోదాలు

385views

న్యూఢిల్లీ: భారత్​తో పాటు విదేశాల్లో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్ల సంబంధాలను విచ్ఛిన్నం చేయడంలో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ -ఎన్​సీఆర్​లోని పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. అయితే, కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు.

ఇటీవలే ఓ డ్రోన్​ డెలివరీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల అక్టోబర్​ 14న జమ్ము కశ్మీర్​లోని పూంచ్​ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. గత తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ కు సంబంధించిన 191 డ్రోన్లు భారత్​లోకి అక్రమంగా ప్రవేశించాయి. ఈ పరిణామాలు దేశంలో అంతర్గత భద్రతకు సవాళ్లుగా నిలుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. భారత్​లోకి డ్రోన్ చొరబడిన ఘటన సోమవారం సైతం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు ద్వారా పంజాబ్​ అమృత్​సర్​లోకి ప్రవేశించిన ఓ డ్రోన్​ను బార్డర్​లోని సైనికులు మట్టి కరిపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి