News

మతం మార్చుకున్న వారికి రిజర్వేషన్లు… రాజ్యాంగ విరుద్ధం: వీహెచ్‌పీ

212views

న్యూఢిల్లీ: రిజర్వేషన్ల ప్రయోజనాన్ని షెడ్యూల్డ్ వర్గాల నుండి మతమార్పిడి ఐన వారికి కేటాయించాలని కోరడం రాజ్యాంగ విరుద్ధం, దేశ వ్యతిరేకం మాత్రమే కాదు, షెడ్యూల్డ్ కులాల హక్కులపై పగటిపూట దోపిడీ కూడా అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) విమర్శించింది.

వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ మీడియాతో మాట్లాడుతూ.. మిషనరీలు, మౌల్వీలు తమ మతాల్లో కులాల ప్రాతిపదికన ఎలాంటి వివక్ష లేదని, తమ గూటికి చేరిన తర్వాత ఏ ఒక్కరు కూడా వెనుకబడి ఉండరని మరోసారి చెబుతుంటారని అన్నారు. అయినప్పటికీ, వారు నిరంతరంగా మతమార్పిడులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్నప్పుడు, వారి సమానత్వం వాదన బూటకమని నిరూపించబడడమే కాకుండా, వారి దుర్మార్గపు ఉద్దేశాలు కూడా బహిర్గతమవుతున్నాయన్నారు. న్యాయాన్ని నిర్ధారించడం వారి ఉద్దేశ్యం కాదు కానీ, మత మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడానికి పూర్తిగా ఉచిత రన్‌వేను పొందడం వారి ఎజెండా…. ఈ అసమంజసమైన డిమాండ్ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి కూడా విరుద్ధమని డాక్టర్ జైన్ అన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి