News

ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి

83views

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం ‘జూమ్‌’ మృతి చెందింది. శ్రీనగర్​లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్‌.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లలో నక్కి ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన జూమ్‌ అనే శునకాన్ని ఉపయోగిస్తున్నారు.

అనంతనాగ్​లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా అధికారులకు సోమవారం సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ముష్కరులపై భద్రతా బలగాలు దాడులు చేశాయి. ఇంట్లో ఉన్న ఉగ్రవాదులను గుర్తించేందుకు ‘జూమ్‌’ అనే ఆర్మీ శునకాన్ని పంపించారు అధికారులు. ఈ క్రమంలో జూమ్​పై కాల్పులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. దీంతో శునకానికి బులెట్ గాయాలయ్యాయి. అయినా జూమ్ వీరోచిత పోరాటాన్ని కొనసాగించింది. దాని ఫలితంగానే భద్రతాబలగాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్‌ను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి