News

శ్రీ మహాకాల్ లోక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

343views

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో ప్రధాని మహాకాళ్ మందిరంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. భారతదేశ అభ్యుదయం, విజ్ఞానానికి ఉజ్జయిని వేలాది సంవత్సరాలుగా నాయకత్వం వహించిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. రూ.856 కోట్ల వ్యయంతో ఈ కారిడార్‌ను నిర్మించారు.

వేదికపై నుంచి శివలింగం ప్రతిరూపాన్ని రిమోట్‌ కంట్రోల్‌ బటన్‌ నొక్కి ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్‌ మంగూబాయ్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లతో కలసి బ్యాటరీ కారులో ప్రయాణిస్తూ కారిడార్‌ను వీక్షించారు. కార్తిక్‌ మేళా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ మహాకాల్‌ ప్రాజెక్టుతో ఉజ్జయినికి శోభ చేకూరనుందని చెప్పారు. ఇక్కడి ప్రతి అణువులోనూ ఆధ్యాత్మికత నిండి ఉందని, నలుదిశలా దైవశక్తి ప్రసారమవుతోందని పేర్కొన్నారు. మొదటిసారిగా చార్‌ధామ్‌లను ఆల్‌-వెదర్‌ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్టు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి