News

తెనాలిలో బీజేపీ ప్రజా పోరు యాత్ర వాహనానికి నిప్పు!

344views

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్​లోని రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి ఉంచారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రచార రథానికి కొందరు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.

ఒక్కసారిగా మంటలు మంటలు రావడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మంటలను అర్పివేశారు. నలుగురు వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రభుత్వ అరాచకాల్ని ప్రజా పోరు ద్వారా ప్రజలకు వివరిస్తున్నందునే అధికార పార్టీకి చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి