News

చండీఘర్ విమానాశ్రయంకు భగత్ సింగ్ పేరు

356views

చండీగఢ్: గొప్ప స్వాతంత్య్ర‌ సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయానికి షాహీద్ భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ మన్ కీ బాత్ ప్రసంగం 93వ ఎపిసోడ్‌లో ఆదివారం ఈ ప్రకటన చేశారు.

సెప్టెంబరు 28న భగత్ సింగ్ జయంతి జరుపుకొనే ముఖ్యమైన రోజు ‘అమృత్ మహోత్సవ్’ రాబోతోందని చెబుతూ “ఆయన జయంతికి ముందు, నివాళిగా, మొహాలీ-చండీగ‌ఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించాము” అని తెలిపారు.

అమరవీరుల స్మారక చిహ్నాలు, వారి పేరు మీద ఉన్న స్థలాలు, సంస్థల పేర్లు మనకు స్పూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ”ప్రియమైన దేశవాసులారా, మూడు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 28న అమృత్ మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్ సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్ సింగ్‌కు ఘన నివాళిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం. ఛండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నాం” అని మోదీ ప్రకటించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి