
347views
గాంధీనగర్: సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం ఆలస్యం కావడానికి అర్బన్ నక్సలైట్లు, అభివృద్ధి వ్యతిరేక శక్తులే కారణమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతూ రాజకీయ ప్రోద్బలంతో డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి అర్బన్ నక్సల్స్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్నారని.. వీరికి వివిధ సంస్థల నుంచి మద్దతు లభిస్తోందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని ఏక్తానగర్లో నిర్వహించిన పర్యావరణ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల పర్యావరణ మంత్రులకు పలు సూచనలు చేశారు.
Source: EtvBharat





