
టెహ్రాన్: ఇరాన్‌లో మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాల్సిందే. 1979లో అయతుల్లా ఖొమేని ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించారు.
అప్పటి నుంచి మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరిగా మారింది. దేశంలో ఇస్లామిక్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇరాన్‌లో 2005లో ఏర్పాటు చేసిన గస్తే ఎర్షాద్ అనే నైతిక పోలీసు వ్యవస్థ హిజాబ్ చట్టాల అమలును పర్యవేక్షిస్తుంది. తమపై బలవంతంగా రుద్దిన చట్టాల గురించి దేశ సరిహద్దులు దాటినప్పుడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల పోలీసుల దాష్టీకంవల్ల మాసా అమీని అనే యువతి మరణించడంతో తమపై అమలవుతున్న నిర్బంధాల మీద మహిళల నిరసనలు పెల్లుబికాయి.
రక్షణాత్మక చర్యలు
అమెరికాలో స్థిరపడిన ఇరాన్ పాత్రికేయురాలు మసీ అలీనేజాద్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను ముద్రించినందుకు 1994లో టెహ్రాన్‌లో అరెస్టయ్యారు. హిజాబ్ నియమాలు, ఇరాన్ మహిళల సమస్యలపై ఆమె గళం విప్పేవారు. మాసా మరణానంతరం తలెత్తిన నిరసనలు మహిళలపై ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో గూడుకట్టుకొన్న ఆగ్రహాన్ని వెల్లడిస్తున్నాయి. అక్కడి కఠినమైన నిబంధనలను ధిక్కరిస్తూ అమ్మాయిలు తలపై ముసుగులను తొలగించి, వాటిని గాలిలో ఊపుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిర్భయంగా ఇరాన్ స్త్రీలు ప్రదర్శించిన ఆగ్రహం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
कार के ऊपर खड़ी महिला ने अपने हिजाब उतारे और हवा में लहराना शुरू कर दिया।
वीडियो ईरान की राजधानी तेहरान की।
ईरान में हिजाब के विरुद्ध मुस्लिम महिलाओं का उग्र प्रदर्शन। pic.twitter.com/w6Gx6TfZNo
— Panchjanya (@epanchjanya) September 23, 2022





