News

మాతా అమృతానందమయి దేవి అంద‌రికీ స్ఫూర్తిదాయకం

134views
  • ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్‌

కొల్లం: మాతా అమృతానందమయి దేవి అంద‌రికీ స్ఫూర్తిదాయకమ‌ని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క సంఘ(ఆర్ఎస్ఎస్) స‌ర్ సంఘ‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్ అన్నారు. కొల్లాంలోని అమృతపురి ఆశ్రమంలోని అమృతానందమ‌యి దేవిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. మన గొప్ప సంప్రదాయం, సంస్కృతి వెలుగులో అమ్మ నుండి చాలా సరళమైన పదాలతో మంచి సలహాలు లభిస్తాయని అన్నారు. ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించ‌కూడ‌దో అమ్మ ఎప్పుడూ సలహాలు ఇస్తుంది. ఇదంతా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే ఇక్కడికి రెగ్యులర్‌గా వస్తున్నాను.

డాక్టర్ మోహన్ భాగవత్ గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు అమృతపురిలోని మాతా అమృతానందమయి మఠానికి చేరుకున్నారు. మఠం సీనియర్‌ సాధువుల ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం ల‌భించింది. అమృతానందమయి దేవిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న డాక్టర్ మోహన్ భాగవత్ రెండు గంటలపాటు సమావేశమై ఆరు గంటలకు తిరిగిముఖం ప‌ట్టారు.

ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ క్షేత్ర ప్రచారక్ ఎ.సెంథిల్‌కుమార్, ప్రాంత్ కార్యవాహ పి.ఎన్.ఈశ్వరన్, క్షేత్ర సేవా ప్రముఖ్ కె.పద్మకుమార్, ప్రాంత్ ప్రచారక్ ఎస్.సుదర్శన్, క్షేత్ర విశేష సంపర్క్ ప్రముఖ్ ఎ.జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం స‌ర్ సంఘ‌చాల‌క్ గురువారం మధ్యాహ్నం కేరళ చేరుకున్నారు.

18వ తేదీ ఉదయం నుంచి గురువాయూర్ రాధేయం ఆడిటోరియంలో జరిగే ఆర్ఎస్ఎస్ ప్రాంత్ కార్యకారిణి బైఠక్‌లో పాల్గొంటారు. సాయంత్రం అయిదు గంటలకు గురువాయూరు శ్రీకృష్ణ కళాశాల మైదానంలో గురువాయూరు సంఘ జిల్లా పూర్ణ గణవేష్ సాంఘీక్ పాల్గొంటారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి