News

కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్‌నాథ్‌సింగ్‌

346views

భాగ్య‌న‌గ‌రం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్​సింగ్‌ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు. కృష్ణంరాజు అనారోగ్యానికి కారణం ఏంటి? తీసుకున్న చికిత్సలపై ఆరా తీశారు. అనంతరం పార్టీలో కృష్ణంరాజు సేవలను ఆయన కొనియాడారు. కాసేపు ప్రభాస్‌తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. రాజ్​నాథ్​సింగ్​ వెంట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ ఉన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి