News

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఢిల్లీ, నెల్లూరులో ఈడీ సోదాలు

144views

నెల్లూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మరోసారి ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఈడీ సోదాలు చేస్తోంది.

ఢిల్లీ మద్యం కుభకోణంలో వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ గురిపెట్టింది. కర్ణాటక, తమిళనాడుతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై, నెల్లూరు, ఢిల్లీలోని మాగుంట నివాసాల్లో ఏకకాలంలో బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు. కార్యాలయంలోకి ఎవరూ రాకుండా పటిష్ట‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి