News

AIDNTDC ఆధ్వర్యంలో విశాఖలో సంచార జాతుల మహాసభ

562views

* సంచార జాతుల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకుల విజ్ఞప్తి

విశాఖపట్నంలోని నాయుడు తోట, శ్రీ లక్ష్మి కళ్యాణ మండపంలో తేది 11-09-22 నాడు 70వ “విముక్తి దినోత్సవం” సందర్భంగా అఖిల భారత విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సంచార జాతుల మహాసభ జరిగింది. అఖిల భారత విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ అన్నపరెడ్డి వెంకట్ అధ్యక్షతన జరిగిన సంచార జాతుల మహాసభకు అఖిల భారత విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి ఫౌండర్ అధ్యక్షులు మరియు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డు ఫర్ డి నోటిఫైడ్ నోమాడిక్ కమ్యూనిటీస్ (DWBDNC) మాజీ చైర్మన్ శ్రీ దాదా భీకురాంజీ ఇదాతే ముఖ్య అతిధిగా విచ్చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ పాడ్, యోగి అతిదేశ్వర్ ఆనంద్ గిరి స్వామి, పూజ్య శ్రీ బోదిహీన్ స్వామి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ శ్రీ గోరంట్ల శ్రీనివాస్ లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రొట్ట లక్ష్మి జోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

శ్రీ దాదా భీకురాంజీ ఇదాతే గారు సభను ఉద్దేశించి మాట్లాతూ సంచార జాతుల అభివృద్ధి కి తమ కమిషన్ చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి వాటిని అమలు చేస్తున్నదని తెలిపారు. DWBDNC బోర్డు, SEED (స్కీమ్స్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఫర్ డి నోడిఫైడ్ నోమాడిక్ కమ్యూనిటీస్)ల ద్వారా విద్య, వైద్య, ఆరోగ్య, ఇన్సూరెన్స్ మరియు హౌసింగ్ స్కీములను సంచార జాతుల కోసం ప్రాంభమైనాయని తెలిపారు. వీటిని సంచార జాతుల వారు ఉపయోగించుకోవాలాని కోరారు.

నేషనల్ ప్రధాన కార్యదర్శి శ్రీ అనిల్ పాడ్ గారు మాట్లాడుతూ సంచార జాతుల ప్రజలు దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు AR. వెంకట్ మాట్లాడుతూ సంచార జాతుల అభివృద్ధికి AIDNTDC ఏ విధంగా కృషి చేస్తున్నదీ వివరించారు. ఈ కార్యక్రమంలో సంచారజాతులంటే ఎవరు? వారి త్యాగాలను, ప్రస్తుతం వారి దీనమైన పరిస్థితిని తెలియజేసి, ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీన విముక్తి దినోత్సవాన్ని జరపడానికి గల కారణాలను తెలియపరచారు .

ఆంధ్రప్రదేశ్ లో సంచార జాతుల సమస్యలు వివరించారు. SEED పోర్టల్ లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కేరళ అధ్యక్షురాలు శ్రీమతి లేతికలా, తెలంగాణా అధికార ప్రతినిధి శ్రీ చెవ్వ చిత్తరంజన్, శ్రీ కుమార్ లు కూడా పాల్గొన్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు శ్రీ గోరంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్టంలో ఉన్న సంచారజాతుల జనగణన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రొట్ట లక్ష్మి మాట్లాడుతూ సంచార జాతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అట్రాసిటీ చట్టం తేవాలని మహిళలపై జరుగుతున్న దాడుల గూర్చి వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.