
408views
* ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులతో మాటామంతిలో తన మనసులోని సంతోషాన్ని పంచుకున్న ప్రధాని
భారత్ బ్రిటన్ ను దాటుకుని ఐదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ‘250 ఏళ్లు మన దేశాన్ని పాలించిన వారిపై ఈ ఘనతను సాధించాం. 6 నుంచి 5వ స్థానానికి చేరామన్న దానికంటే వీరిని వెనక్కి నెట్టామనే విషయమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది’ అని మోడీ పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా జాతీయ అవార్డు అందుకున్న టీచర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.





