198
భారత్ డిజిటిల్ చెల్లింపుల్లో దూసుకుపోతోంది. టీ కొట్టు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకూ అన్నిచోట్లా ఆన్లైన్ పేమెంట్స్ అందుబాటులో ఉండటంతో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారత్ డిజిటల్ చెల్లింపుల్లో సరికొత్త మైలురాయిని చేరింది. ఆగస్టు నెలలో 657 కోట్ల UPI ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.10.72 లక్షల కోట్ల లావాదేవీలు జరిపినట్లు కేంద్రం తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో ఇది సరికొత్త రికార్డు.