News

ప్రపంచదేశాలను సాయం అర్థిస్తున్న పాక్

346views

పాకిస్థాన్ ను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల వల్ల పాక్ మరణించిన వారి సంఖ్య 1,265కు చేరింది. భారీ వరదలకు దేశంలోని మూడో వంతు ప్రాంతం నీట మునిగింది. సుమారు 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులై పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అసలే కష్టాల్లో ఉన్న పాక్, వరదల నష్టంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రిక్త హస్తాలతో, భిక్షా పాత్రతో ప్రపంచాన్ని సాయం అర్థిస్తోంది.  వరదలతో తీవ్రంగా నష్టపోయిన తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలకు పాక్ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే UNO రూ.1,275 కోట్లు, అమెరికా రూ.239 కోట్ల సాయాన్ని పాక్ కు ప్రకటించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.