News

ఓనమ్‌ పండుగ… తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు ప్రత్యేక రైళ్ళు

372views

విజ‌య‌వాడ‌: ఓనమ్‌ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌–త్రివేండ్రమ్‌ (07119/07120) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 5న సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు త్రివేండ్రమ్‌ చేరుకోనుంది.

తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్‌ 10న రాత్రి 10 గంటలకు బయల్దేరి రెండో రోజు తెల్లవారు జామున 3 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–యశ్వంత్‌పూర్‌ (07159/07160) స్పెషల్‌ ట్రైన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు ఈనెల 5న రాత్రి 8.25 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6వ తేదీ సాయంత్రం 5.20గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి