News

పాకిస్తాన్‌లో ఆహారం ఆశ చూపి హిందూ బాలిక‌పై సామూహిక అత్యాచారం

499views

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌… అభివృద్ధి లేని ఒక దేశం… దీనికి తోడు ప్ర‌కృతి క‌న్నెర్ర‌… వెర‌సి దిక్కుతోచ‌ని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ దేశ ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి, లోకం జాలి ప‌డుతోంది. మ‌న దేశం వంటి కొన్ని దేశాలు సాయం చేస్తామ‌ని భ‌రోశా ఇస్తున్నాయి. అయితే, అక్క‌డి ప్ర‌జ‌లకు ఇవేవీ ప‌ట్ట‌డ‌డం లేదు. త‌మ వికృత రూపాన్ని ఎప్ప‌టి వ‌లె
ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తాజాగా ఓ ఘోర సంఘ‌ట‌న పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. వ‌ర‌ద‌ల‌కు క‌కావికల‌మై, ఆహారం కోసం అల‌మ‌టిస్తున్న ప్ర‌జ‌లెంద‌రో… ఈ అవ‌కాశాన్ని తీసుకున్న కొంత‌మంది దుర్మార్గులు ఓ హిందూ బాలిక‌పై క‌న్నెశారు. ఆక‌లితో ఉన్న ఆమెకు ఆహారం ఆశ‌చూసి, రెండు రోజుల‌పాటు సామూహికంగా అత్యాచారం చేశారు.

ఆటోరిక్షా డ్రైవర్ ఖాలీద్ బాలికకు రేషన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ, అతను ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమెకు రెండు రోజుల పాటు మత్తుమందు ఇచ్చి, మరో వ్యక్తి దిల్షెర్ అత్యాచారం చేశాడు. నిందితులు ఇద్దరూ మచ్చి కులానికి చెందిన వారని ఆమె పోలీసులకు వివ‌రించింది. ఈ ఘటన సింధ్‌ ప్రావిన్స్‌లోని సంఘర్‌ జిల్లా షహదాద్‌పూర్‌లో చోటుచేసుకుంది.

అంతకుముందు, వరదల కారణంగా రోడ్లపై ప‌డ్డ‌ సింధ్‌లోని ఉమర్‌కోట్‌లో కొంతమంది హిందువులు తమ మహిళలపై గూండాలు అత్యాచారానికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.

చాలా మంది పాకిస్తానీ హిందువులు సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. వారు పాకిస్తాన్ సమాజంలోని అత్యంత పేద వర్గాలకు చెందినవారు. భూ ఆక్ర‌మ‌ణ‌, అపహరణ, మతమార్పిడి, ఉపాధి లేకపోవడంతో వంటి వాటిని వారు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ తమ ముస్లిం భూస్వాముల వద్ద కార్మికులుగా జీవిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయ‌లేని సాధారణ దోపిడీకి గురవుతున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి