
396views
-
30 ఏళ్ళుగా ఎన్నడూ లేదు
-
3 కోట్ల 30 లక్షల మందిపై తీవ్ర ప్రభావం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ను కొద్ది రోజులుగా భారీ వరదలు ముంచెత్తాయి. గత 30 ఏళ్ళలో ఎప్పుడూ లేని స్థాయిలో కురిసిన వర్షాలకు దాయాది దేశం అస్తవ్యస్తమైంది. దాదాపు 3 కోట్ల 30 లక్షల మందిపైగా ఈ వరదలు ప్రభావం చూపాయని పాక్ అంతర్గత మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.
పాక్లో గత 30 ఏళ్ళలో వర్షాకాలంలో సగటు వర్షపాతం 132.3 మిల్లీమీటర్లుకాగా.. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ 385.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మూడు దశాబ్దాలతో పోలిస్తే ఇది 192 శాతం ఎక్కువని పాక్ వాతావరణ విభాగం తెలిపింది. వరదల ధాటికి ఇప్పటివరకూ 982 మంది మరణించారని.. 1456 మంది గాయపడ్డారని పాక్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గణాంకాలు తెలిపాయి.





