208
విజయవాడ: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డంకులు సృష్టించడం సరికాదని…. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్సవ కమిటీలను పోలీసులు భయపెట్టడం మానుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో వాడవాడల్లో జరుపుకోవడం అనాదిగా వస్తున్న హిందూ ధర్మాచారం అన్న సోము.. అందుకు విరుద్ధంగా ఈ సంవత్సరం వేడుకల్లో డీజే సౌండ్ సిస్టంగాని, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వీలు లేదు అనడం ఏంటని ప్రశ్నించారు. అందుకోసం ముందస్తు హామీ పత్రం తప్పనిసరి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే… పెద్దఎత్తున ప్రజాఉద్యమాన్ని చేపడతామని సోము వీర్రాజు హెచ్చరించారు.