
345views
న్యూఢిల్లీ: సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 5జీ సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ వినియోగదారులు కూడా 5జీ సేవల రాక కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్, అహ్మాదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. మొదట్లో ఈ నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న నగరాలకు సైతం సేవలను అందించనున్నారు.





