
408views
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే, ఉలా రైల్ భాగస్వామ్యంతో మహాలయ అమావాస్య దివ్య కాశీ యాత్ర పేరుతో రైలుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న ప్రారంభం కానుందని రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ వావిలాపల్లి రాంబాబు తెలిపారు. మధురై నుంచి ప్రారంభమై 12 రోజుల పాటు సాగుతుందని వివరించారు. ఈ యాత్రలో భాగంగా రైలు మదురైలో ప్రారంభమై దక్షిణ మధ్య రైల్వేలోని నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వరగంల్ రైల్వే స్టేషన్లలో అగనుందని తెలిపారు. ఇది కాశీ, గయా, అలహాబాద్, అయోధ్య, నైమిశారణ్యం, దిల్లీ, హరిద్వార్, ఆగ్రా వంటి ప్రముఖ స్థానాలకు వెళ్ళనుందని వివరించారు.





